పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న అనసూయ!
on Jun 5, 2023
అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా రంగమార్తాండ సినిమాలో మంచి పాత్రని చేసానని మీడియా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ ప్రస్తుతం తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అనసూయ సండే వస్తే వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటున్న అనసూయ.. వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన భర్త భరద్వాజ్ తో కలిసి సముద్రపు ఒడ్డున దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. ఒక ఫోటోలో తను లిప్ కిస్ ఇస్తూ దిగింది. మరొక ఫోటోలో అనసూయ కావాలనే తన అందాన్ని ఒలకబోసినట్టుగా ఉంది.
తాజాగా అనసూయ పెళ్లిరోజు కావడంతో ఆమె తన భర్తతో కలిసి బీచ్ లో సరదాగా గడిపింది. అనసూయ వైట్ డ్రెస్ లో భర్త భరద్వాజ్ తో కలిసి ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలని చూసి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పది ఫోటోలలో రెండు మూడు ఫోటోలు మరీ బోల్డ్ అండ్ హాట్ గా ఉన్నాయి. అయితే కొందరు నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారు. వెరీ హాట్ అంటూ ఒకరు కామెంట్ చేయగా, మీరు ముసాలవిడ అవ్వకూడదని ఒకరు కామెంట్ చేశారు. ఇలా తను దిగిన బోల్డ్ అంట్ హాట్ ఫోటోస్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం వల్ల ఆ పోస్ట్ కి కామెంట్ల వర్షం కురుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read